Digital Dictionaries of South Asia
A Telugu-English Dictionary.
  
   వేంచేయు [from Skt. విజయముచేయు.] v. n. To proceed; to deign to come; to condescend to go. వచ్చు, పోవు. To come and take a seat, కూర్చుండు. To live or dwell. ఉండు, నివసించు. మాయింటికి వేంచేస్తారా will you do me the honor to come to my house? ఆయన కంచిలో వేంచేసియున్నారు he lives at Conjevaram.
   వేంద్రము [Tel.] n. Heat, either of the sun of a pungent taste, ఉగ్రము, తాపము. వేంద్రపడు vēnḍra-paḍu. v. n. To be hot or angry, మండిపడు." తల్లికి కలనైన దయలేదు నామీద తండ్రియెప్పుడు చూచి వేండ్రపడును." H. iii. 195.
   వేకటి or వ్రేకటి [Tel.] n. Pregnancy, కడుపు, గర్భము. వేకటిమనిషి vēka-ṭi-manishi. n, A pregnant woman.
   వేకరము [Tel.] n. Danger, harm, ఉపద్రవము.
   వేకరి [Tel. వ్రేకము+అరి.] n. A gypsy tribe.
   వేకి [Tel.] n. Fever. జ్వరము. మలవేకి Malaria or hill fever. లోవేకి internal fever. "ఎర్రనాడు దానియేపాటి జూచిన వెర్టిపట్టిమిగుల వేకిపుట్టు." Vēma. 170.
   వేకువ [Tel. from వేగు.] n. The dawn, morning. ప్రభాతము, వేగుజాము. వేకువజాము vēkuva-dzāmu. n. The morning watch. తెల్లవారిజాము. వేకువనే vēkuva-nē. adv. Early in the morning.
   వేగ [from Skt. వేగః.] n. Swiftness, speed, haste, వడి, త్వర. వేగ, వేగముగా or వేగమే vēga. adv. Speedily, hastily, quickly. శీఘ్రముగా, త్వరగా. "కుండలంబులు వేగగొనిరమ్ము నాలవనాటికి." M. I. i. 164. వేగము vēgamu. [Skt.] n. Swiftness, celerity, velocity, speed, haste, త్వర, త్వరితము, జనము. A stream, flow, current. ప్రవాహము. వేగపడు vēga-paḍu. v. n. To make haste, త్వరపడు. వేగపాటు or వేగిరపాటు vēga-pāṭu. n. Hurry, haste, త్వర, శీఘ్రము. "వేగపాటేలయతడునీ విభుడగుటకు." A. v. 86. వేగవతి vēga-vati. n. The name of a river that runs by Conjevaram.
   వేగరి See under వేగు.
   వేగి [from Skt. వ్యాఘ్ర.] n. A tiger, పులి. [Skt.] n. A horse. Lit. that which goes fast.
   వేగి or వేగిస [Tel.] n. A tree, Pterocarpus bilobus. స్వర్ణకవృక్షము, కర్తబీజి. Various kinds are called జిట్టవేగి and ముల్లువేగి. "వేగివేముమొదలుగాగలమ్రాకుల." P. iv. 545.
   వేగి, వేగీ or వేగినాడు [Tel.] n. The country round Rajamundry, రాజమహేంద్రవరము చుట్టునుండు దేశము. "జమ్మిలోయబడి వేగిదహించె." A. preface 43.
   వేగించు See under వేగు.
   వేగిరము [from Skt. వేగము.] n. Haste, speed, swiftness, త్వర, శీఘ్రము. adv. Quickly, త్వరితము. వేగిరించు or వేగిరపడు vēgir-inṭsu. v. n. To hurry or hasten. త్వరపడు. "తామసించిసేయు దగదెట్టి కార్యంబు వేగిరింపనదియు విషమమగును, పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమవునె." Vēma. 103. వేగిరకాడు vēgira-kāḍu. n. A quick man; a hasty or rash man, త్వరగలవాడు. వేగిరకత్తె vēgira-katte. n. A quick woman, a hasty or rash woman, త్వరగలది. వేగిరపాటు vēgira-pāṭu. n. Hastening. త్వరపడుట. వేగిరపెట్టు vēgira-peṭṭu. v. a. To cause to hasten, to expedite, త్వరపరుచు.