Digital Dictionaries of South Asia
A Telugu-English Dictionary.
  
   నలభై or నలుబది [Tel. నలు+పది.] n. & adj. Forty. నలభైమంది forty people.
   నలి [Tel. from నలుగు.] n. Dust, powder. పొడి, చూర్ణము. Indisposition, illness, రోగము. Rubbish, weeds, stuff. చిదుగులు. Affection, love. ప్రేమ. నలితీయు to clear, clean, weed, adj. Powdered, bruised, నలిగిన. Trivial, slight. స్వల్పము. Lean, సన్నము. నలితిండి eating trash, చిరుతిండి. adv. Duly, fitly, properly, యోగ్యముగా. నలికండ్లపాము, నలికిరి, నలికీచి or నలికీచు nali-kanḍla-pāmu. n. The polished shining greenish house lizard with a scarlet tail, that haunts houses. Lacerta interpunctata. Linn. బ్రహ్మాణి, రక్తపుచ్ఛిక నలికము nalikamu. n. Smallness, minuteness, as dust. సూక్ష్మము, తనుత్వము, సన్నదనము. నలిగులి nali-guli. adj. Very much bruised or crushed. మిక్కిలినలిగిన. నలిగొట్టు nali-goṭṭu. adj. Very thin. మిక్కిలిసన్నమైన. నలినలి nali-nali. adv. Fretfully. నలినలిఅగు to be peevish , to fret, నొచ్చు. నలినలిచేయు to harass, torment. నలినూకలు nali-nūkalu. n. Dust, powder. అర్థతండులములు. నలిపొడి nali-poḍi. n. Saw-dust, chips, shavings, dirt, fragments. నలిబులి nali-buli. n. Confusion, అల్లకల్లోలము. నలిరేగు nali-rēgu. v. n. To take fire, to become irritated or enraged. విజృంభించు. నలియు Same as నలుగు. (q. v.)
   నలినము or నలిని [Skt.] n. A lily. తామర. నలినాయతాక్షి or నలినాక్షి nalin-āyat-ākshi. n. A woman who has fair eyes or lily-like eyes. నలినారి nalin-āri. n. The 'Foe to lilies:' i.e., the moon.
   నలు or నాలుగు [Tel.] adj. Four. నలుదెసలు the four quarters or sides. నలుగురు, నల్గురు, నలువురు or నల్వురు naluguru. n. Four persons. Some persons, several people, as in English we say half a dozen without meaning exactly the number six. నలుచదరము nalu-ṭsadaramu. adj. Four-square. నలుతుము or నల్తుము (నాలుగు+తూము.) four bushels. నలుదిక్కులు or నల్దిక్కులు nalu-dikkulu. n. All round: lit: the four sides. నలుగడలు or నల్గడలు (నలు+కడ.) నలుదెసలు or నల్దెసలు nalu-desalu. adv. On all sides. నలుబది, నలుపది or నలభై nalu-badi. (నలు+పది.) adj. Forty. నలువంద్రు nalu-vanḍru. n. Forty persons. నలుబదిమంది. నలువ or నల్వ naluva. (నలు+వా or వాయి face.) n. A name of Brahma, as the four-faced god. నలుపాల a houes with an open space in the middle. చుట్టుకొల్లారు.